శ్రీనగర్: ‘లాహిరి లాహిరి లాహిరిలో.. ’ అంటూ మనసిచ్చిన ప్రేయసితో కూనిరాగాలు పాడుకోవడమే కాదు. నడుస్తున్న పడవలోనే డబ్బులను కూడా డ్రా చేసుకుంటే ఎంత బాగుంటుంది? ఎస్బీఐ నీటిలో తేలియాడే (ఫ్లోటింగ్) ఏటీఎంను ప్రారంభించింది. పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా జమ్ముకశ్మీర్‌లోని దాల్ సరస్సులో ఓ హౌజ్‌బోట్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. 2004లో ఎస్బీఐ కేరళలోని ఎర్నాకులంలో తొలి ఫ్లోటింగ్ ఏటీఎంను ఏర్పాటుచేసింది.