అకోలా: హిందుత్వవాది వినాయక్ దామోదర్ సావార్కర్‌పై రాహుల్ గాంధీ ఇవాళ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మహారాష్ట్రలో ర్యాలీ నిర్వహిస్తున్న ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. వీడీ సావార్కర్‌పై మళ్లీ ఆరోపణలు గుప్పించారు. బ్రిటీషర్లకు సావార్కర్ భయపడ్డారని, వాళ్లకు సేవకుడిగా పని చేసుకునేందుకు ఆయన ప్రయత్నించారని, దీని కోసం బ్రిటీషర్లకు సావార్కర్ లేఖలు కూడా రాసినట్లు రాహుల్ తెలిపారు.
కొన్ని రోజుల క్రితం సావార్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ కూడా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదు. కావాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం తనను అరెస్టు చేసుకోవచ్చు అని కూడా రాహుల్ సవాల్ చేశారు.
सावरकर जी ने अंग्रेजों की मदद की। उन्होंने अंग्रेजों को चिट्ठी लिखकर कहा – सर, मैं आपका नौकर रहना चाहता हूं।
– श्री @rahulgandhi pic.twitter.com/1sKszyDXR0
— Congress (@INCIndia) November 17, 2022
సావార్కర్ది ఒక విజన్ అని, మహాత్మా గాంధీది మరో విజన్ అని, దేశంలో ఈ రెండు విజన్ల మద్య ఫైట్ నడుస్తోందని, తాము చర్చలకు ఓపెన్‌గా ఉన్నామని, తమ పార్టీలో నియంతలు లేరని రాహుల్ అన్నారు. అండమాన్ జైలులో ఉన్న సావార్కర్.. ఆ సమయంలో బ్రిటీషర్లకు లేఖ రాశారని, భయం వల్లే అతను ఆ లేఖలు రాసినట్లు రాహుల్ తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలు వివాదాస్పద కావడంతో.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. వీడీ సావార్కర్ పట్ల తమకు ఎనలేని గౌరవం ఉందన్నారు. సావార్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆయన తిరస్కరించారు. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధుడిపై కాంగ్రెస్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు బీజేపీ ఆరోపించింది.