న్యూఢిల్లీ: భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సుకు తూర్పున చైనా కొత్తగా గగనతల రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్టు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఐదేండ్ల క్రితం సరిహద్దుల్లో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడిన ప్రదేశానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి.
ఇక్కడ గగనతల రక్షణ కాంప్లెక్స్, కమాండ్ కంట్రోల్ భవనాలు, బ్యారక్‌లు, వాహనాల కోసం షెడ్లు, ఆయుధ నిల్వలు, రాడార్ల స్థాపన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్షిపణి ప్రయోగ కేంద్రాలను కవర్ల మాటున నిర్మించడం ఆందోళనకర అంశమని నిపుణులు పేర్కొంటున్నారు.