Sashi Tharoor | చింతన్ శిబిరంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు!
కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సుగా ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిరంపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సుగా ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిరంపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్కరణ, ప్రక్షాళన, పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా చింతన శిబిరం జరిగిందని, ఈ ప్రక్రియ పార్టీలో పలువురు నేతలు కోరుకున్న విధంగా ఫలితాలు ఇస్తుందా అనేది చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రాజస్ధాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శిబిరం గురించి మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నేతల భిన్నాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సంప్రదింపుల ప్రక్రియ విస్తారంగా జరగాలని సంస్కరణవాదులు కోరుతున్నారని చెప్పారు.
ప్రతిపాదిత సలహా మండలిలో ఇలాంటి సమాలోచనలు సాగితే చింతన్ శిబిరంలో ఆశించిన ఫలితాలు చేకూరినట్టేనని వ్యాఖ్యానించారు. ఆ దిశగా కసరత్తు జరిగి ఆశించిన ఫలితాలు వస్తాయా అనేది వేచిచూడాలని ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరుతూ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి 2020లో లేఖరాసిన జీ23 నేతల్లో శశి థరూర్ ఒకరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

