Delhi Metro | మెట్రో రైల్ డోర్ల మధ్య ఇరుక్కున్న చీర.. తీవ్రంగా గాయపడి మహిళ మృతి
ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro) విషాదం చోటుచేసుకున్నది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. రీనా అనే మహిళ ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్లో రైలు దిగుతున్నది.
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro) విషాదం చోటుచేసుకున్నది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. రీనా (Reena) అనే మహిళ ఇందర్‌లోక్ మెట్రో స్టేషన్లో (Inderlok Station) రైలు దిగుతున్నది. ఈ క్రమంలో ఆమె చీర (Sari) డోర్ల మధ్య ఇరుక్కుపోయింది. రైలు కదలడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో తలకు, ఛాతీకీ తీవ్రగాయాలయ్యాయి. మెట్రో సిబ్బంది ఆమెను హుటాహుటిన సఫ్దర్‌జంగ్ దవాఖానకు (Safdarjung Hospital) తరలించారు. అయితే చికిత్స పొందుతూ రీనా మృతిచెందింది.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్‌కు వెళ్తున్న మెట్రో రైలులో రీనా ఎక్కింది. అయితే కొద్దిసేపట్లోనే తన కూతురు కోసం రైలు దిగుతుండగా ఆమె చీర డోర్లలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తుచేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, రీనా భర్త ఏడేండ్ల క్రితమే చనిపోయారని, ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

