న్యూఢిల్లీ: కోల్కతాలో పీజీ వైద్యురాలి అత్యాచారం(Kolkata Doctor Case) కేసులో .. సీబీఐ కీలక రిపోర్టును వెల్లడించింది. ఆర్జీ కార్ కాలేజీలో జరిగిన ఘటనలో.. గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ తన రిపోర్టులో వెలల్డించింది. కోల్కతా పోలీసు శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేసిన సంజయ్ రాయ్ ఆ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే పీజీ డాక్టర్ను .. సంజయ్ రాయ్ రేప్ చేసి, మర్డర్ చేసినట్లు సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొన్నది. సీల్దాలో ఉన్న అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సీబీఐ తన నివేదికను అందజేయనున్నది.
ఆగస్టు 9వ తేదీన క్రైం జరిగింది. హాస్పిటల్ బ్రేక్ టైంలో సెమినార్ రూమ్లో నిద్రించేందుకు వెళ్లిన పీజీ వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. చార్జ్షీట్లో గ్యాంగ్ ప్రస్తావన చేయలేదు. రాయ్ ఒక్కడే నేరానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ కేసులో ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.