Shiv Sena (UBT) MP : శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం దాడి జరిగిన క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ పరోక్ష విమర్శలు గుప్పించారు. ఢిల్లీ అహ్మద్ షా అబ్దాలి ( అమిత్‌షాను ఉద్దేశించి) మహారాష్ట్రలో అరాచకం వ్యాప్తి చేసేందుకు సుపారి ఇస్తున్నారని ఆరోపించారు. ఠాక్రే కాన్వాయ్‌పై నిన్న రాత్రి దాడి జరిగింది.
ఢిల్లీ అహ్మద్ షా అబ్దాలి మీకు సుపారి ఇచ్చి మహారాష్ట్రలో అరాచకం రేపేందుకు ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని వాడుకుంటూ సుపారీ ద్వారా మీ నోరు మూయిస్తున్నారు. ఇది మన రాష్ట్రానికి మేలు చేయదని, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తుండటంతోనే వారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని, తాను ఆయా పార్టీల పేర్లు ప్రస్తావించనని రౌత్ పేర్కొన్నారు.
ఇక ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం రాత్రి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) కార్యకర్తలు కొబ్బరి కాయలు, ఆవు పేడను విసిరారు. ఇక ఠాక్రే కాన్వాయ్‌పై దాడి నేపధ్యంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపై అంతకుముందు ఆనంద్ దూబే విరుచుకుపడ్డారు. ఈ దాడికి బాద్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జడ్ క్యాటగిరీ భద్రత కలిగి, బాబాసాహెబ్ ఠాక్రే కుమారుడైన ఉద్ధవ్ ఠాక్రేకు భద్రత లేకపోవడం ఆందోళన రేకెత్తిస్తున్నదని, ఈ దాడి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని అన్నారు. మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కారుపై టమాటాలతో దాడి చేశారని ఇందుకు ప్రతిగానే ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై దాడి జరిగిందని ఎంఎన్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
Read More :
Radhika Madan | అందం కోసం ఆ పని చేయడం తప్పుకాదు: రాధికా మదన్