Special Status : బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో జేడీయూ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో పదేండ్ల పాటు భాగస్వామిగా ఉన్న విపక్షం బిహార్‌కు ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు. 2000 నుంచి 2009 వరకూ వారు లేకుండా కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగించలేని పరిస్ధితి ఉందని, అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో వారు ఏమాత్రం పనిచేయలేదని విమర్శించారు.
ప్రత్యేక హోదా గురించి వారు కనీసం ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదని చెప్పారు. తాము మాత్రం మొదటినుంచీ ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నామని, ఈ విషయంలో సీఎం నితీష్ కుమార్ నిబద్ధతతో కృషి చేస్తున్నారని అన్నారు. భవిష్యత్‌లో బిహార్‌కు కొద్దిపాటి ఊతం లభించినా తాము కూడా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబడతామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో అవరోధాలు ఏమైనా ఉంటే ప్రత్యేక ప్యాకేజ్ అయినా ప్రకటించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
బిహార్‌కు ఇతోధిక సాయం అందడమే తమ లక్ష్యమని ఈ విషయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. ఇక సీఎం నితీష్ కుమార్ సారధ్యంలోని 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తలపడుతుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయానికి సంకేతాలని ఆయన చెప్పుకొచ్చారు. 243 అసెంబ్లీ స్ధానాలకు గాను 170పైగా స్ధానాల్లో తమకు లోక్‌సభ ఎన్నికల్లో ఆధిక్యం లభించిందని గుర్తుచేశారు.
Read More :
Earthquake | మహారాష్ట్రను వణికించిన స్వల్ప భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు