జైపూర్: రైలులోని ఏసీ బోగీల్లో ప్రయాణించే వారికి ప్రింటెడ్ బ్లాంకెట్ కవర్లను అందజేసే పైలట్ ప్రాజెక్టును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. జైపూర్-అసర్వా ఎక్స్ప్రెస్ రైలులో ఈ పథకం ప్రారంభమైంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తరిస్తారు.
అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, దుప్పట్ల పరిశుభ్రత గురించి ప్రయాణికుల మనసుల్లో సందేహాలు ఉంటాయని చెప్పారు. ఆ సందేహాలను తొలగించడం కోసం బ్లాంకెట్ కవర్స్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.