World Tiger Day | పులులను రక్షించుకుందాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. పూరీ తీరంలో 15 అడుగుల సైకత చిత్రం
సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు.
World Tiger Day | సందర్భానుసారంగా అందరినీ ఆలోచింపచేసేలా మట్టితో చిత్రాలను రూపొందించడం ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సొంతం. ప్రపంచ పులుల దినోత్సవం (World Tiger Day) సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ (Puri) తీరంలో మట్టితో 15 అడుగుల ఎత్తున్న పులి బొమ్మను రూపొందించారు. తల్లి పులి తన పిల్లను ప్రేమతో నిమురుతున్నట్లుగా ఈ చిత్రాన్ని తయారు చేశారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవుల్లో ఉండే తమను రక్షించండి (Save Us to Save the Environment) అంటూ జనారణ్యంలో ఉండే జనాలకు పులులు చెబుతున్నట్లుగా ఈ సైకత శిల్పాన్ని ఆయన చెక్కారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో ఉన్న పులుల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. దీంతో పులులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో 2010 నుంచి ప్రతిఏటా జూలై 29ని ప్రపంచ పులులు దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచంలో సుమారు 5 వేల పులులు ఉంటే ఒక్క భారత్లో 3 వేలకుపైగా ఉండటం విశేషం. అడవి పులులు అత్యధికంగా ఉన్నది కూడా మన దేశంలోనే కావడం గమనార్హం. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో 2006 నుంచి పులుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నది. ఆ ఏడాది 1,411గా ఉన్న పులుల సంఖ్య, 2010 నాటికి 1,706కు చేరింది. 2014లో 2,226, 2019లో 2,967, 2023 వచ్చేసరికి వాటి సంఖ్య 3,167కు పెరిగింది. దేశంలో ప్రతి నాలుగేండ్లకు పులుల జనాభాను లెక్కిస్తారు.
భారత్ తర్వాత రష్యాలో అత్యధికంగా 540 పులులు ఉన్నాయి. ఇండోనేషియాలో 500, నేపాల్లో 355, థాయిలాండ్లో 189, మలేషియాలో 150 చొప్పున ఉన్నాయి. ఇక మన పొరుగు దేశంలో చైనాలో 50 మాత్రమే ఉండగా, మయన్మార్లో 22, వియత్నాంలో 5, లావోస్లో 2 చొప్పున పులులు ఉన్నాయి.
#WATCH | Odisha: Sand artist Sudarsan Pattnaik created a 15-foot tall tiger on the occasion of World Tiger Day, in Puri. (28.07) pic.twitter.com/XJDCR2Iaf9
— ANI (@ANI) July 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- china
- environment
- India
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

