న్యూఢిల్లీ: విధుల నిర్వహణలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ పబ్లిక్ సర్వెంట్లను ప్రాసిక్యూట్ చేయాలంటే, ముందుగా అనుమతి పొందడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు బుధవారం చెప్పింది.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు బిధు ప్రసాద్ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపణలను ట్రయల్ కోర్టు విచారించింది. అయితే, ట్రయల్ కోర్టు ఆదేశాలను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈడీ వాదనను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.