పాట్నా : బీహార్ 24వ ముఖ్యమంత్రిగా బీజేపీకి చెందిన సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ సయ్యద్ అత్ హస్నైన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం, జేడీ (యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమ్రాట్ చౌదరికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజాసేవ పట్ల ఆయన అంకిత భావం, క్షేత్రస్థాయి అనుభవం రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఇద్దరు జేడీ(యూ) నేతలు ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టవచ్చునని భావిస్తున్నారు. ఈ రోజు నుంచే తాను పనిలోకి దిగుతానని, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం నితీశ్ కుమార్ అభివృద్ధి చేసినా పాలనా విధానాలను రాష్ట్రంలో అనుసరిస్తానని చౌదరి మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.