లక్నో : నాథూరాం గాడ్సేను అభిమానించే వారిని ముస్లింలు ఎన్నడూ విశ్వసించరని అందుకే బీజేపీకి వారు ఎప్పటికీ ఓటు వేయరని యూపీలోని సంభాల్ ఎస్పీ ఎమ్మెల్యే ఇక్బాల్ అహ్మద్ అన్నారు. పస్మండ ముస్లింలతో లక్నోలో ఇటీవల కాషాయ పార్టీ నిర్వహించిన సమావేశం గురించి ఆయన ప్రస్తావిస్తూ నిజమైన ముస్లిం ఎన్నడూ బీజేపీకి ఓటు వేయరని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీని అంతమొందించిన గాడ్సేను గౌరవించే వారిని ముస్లింలు నమ్మరని స్పష్టం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతిపైనా ఎస్పీ ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్ధల గురించి ఆమె భయపడుతున్నారని, అందుకే ఆమె ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరని వ్యాఖ్యానించారు. బీజేపీని ఎస్పీనే దూకుడుగా ఢీ కొంటోందని అన్నారు.