లక్నో: సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత హరీష్ మిశ్రాపై కర్ణి సేన మద్దతుదారులు కత్తితో దాడి చేశారు. (Samajwadi Party Leader Attacked) దీంతో ఆయన అనుచరులు వారిని పట్టుకుని కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. కర్ణి సేనపై వ్యాఖ్యలు చేసిన ఎస్పీ నేత హరీష్ మిశ్రాపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. కత్తితో పొడిచేసేందుకు ప్రయత్నించారు.
కాగా, హరీష్ మిశ్రా అనుచరులు, ఆయన మద్దతుదారులు వారిని పట్టుకున్నారు. కర్ణి సేన మద్దతుదారులైన ఆ వ్యక్తులను రక్తం కారేలా కొట్టారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. దీంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
⚠️ Trigger Warning : Sensitive Video ⚠️
वाराणसी में सपा नेता हरीश मिश्रा पर हमला। भीड़ ने दो हमलावरों को पकड़कर पीटा, लहूलुहान किया। हरीश मिश्रा ने करणी सेना पर कुछ बयान दिया था। आरोप है कि हमलावर करणी सेना से जुड़े हुए हैं। pic.twitter.com/m6WQSNvJZo
— Sachin Gupta (@SachinGuptaUP) April 12, 2025