లక్నో, మే 6: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ‘ఐప్యాక్’ సేవలు పొందిన అధికార డీఎంకే, తృణమూల్ ఘోర పరాజయం నేపథ్యంలో.. యూపీలో అఖిలేశ్ పార్టీ సమాజ్వాదీ సదరు రాజకీయ కన్సల్టెన్సీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది.
అయితే ఎన్నికల ఫలితాల కారణంగా ‘ఐప్యాక్’తో ఒప్పందాన్ని రద్దు చేసుకుందన్న వార్తల్ని పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొట్టిపారేశారు. నిధుల కొరత వల్లే ‘ఐప్యాక్’తో కొనసాగలేకపోయామని అన్నారు. బుధవారం లక్నోలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఐప్యాక్ సేవల్ని పార్టీ కొద్ది నెలలు వినియోగించుకుందని అన్నారు.