న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. యూపీ బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే దిగ్విజయ్ నారాయణ్ చౌబే బీజేపీని వీడి సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఇవాళ లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సమక్షంలో సైకిల్ ఎక్కారు. అఖిలేష్ యాదవ్ పార్టీ కండువా కప్పి చౌబేను పార్టీలోకి ఆహ్వానించారు.
నారాయణ్ చౌబేతోపాటు బహుజన్ సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే వినయ్ శంకర్ తివారీ, మాజీ ఎంపీ కుశాల్ తివారీ కూడా సమాజ్‌వాది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య నేతల జంపింగ్‌లు మొదలయ్యాయి.