Yoga | న్యూఢిల్లీ: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు బోధిస్తున్న సంయమ సాధన వల్ల మెదడు జీవ సంబంధిత వయసు తగ్గుతుందని పరిశోధకులు నిర్ధారించారు. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో అనుబంధం గల మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, బేఠ్ ఇజ్రాయెల్ డెకోనెస్ మెడికల్ సెంటర్ల పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఏకాంతంలో సంయమ సాధన చేసేవారిపై ఈ అధ్యయనం దృష్టి పెట్టింది.
ధ్యానం చేసేవారి మెదడు వయసు వారి అసలు వయసు కన్నా దాదాపు 5.9 సంవత్సరాలు తక్కువగా కనిపించింది. ఈ అధ్యయన నివేదికను సద్గురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. మానవ యంత్రాంగ నిర్మాణంపై అనుభవపూర్వక శాస్ర్తాల ప్రభావాన్ని ఆధునిక సైన్స్ గుర్తించి,ప్రామాణీకరించగలుగుతుండటం అద్భుతమని ప్రశంసించారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా శారీరక, మానసిక ఆరోగ్యం కోసం కృషి చేయాలని అన్నారు.