న్యూఢిల్లీ: పరీక్షా పే చర్చా(Pariksha Pe Charcha) కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థపకుడు సద్గురు జగ్జీ వాసుదేవ్ విద్యార్థులతో సంభాషించారు. స్టూడెంట్స్తో మాట్లాడియన ఆయన వారికి అనేక సూచనలు చేశారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పారు. విద్యార్థుల మేధస్సుకు పాఠ్యపుస్తకాలు సవాల్ కాదు అని అన్నారు. మీరు పరీక్షలు మంచిగా రాసినా, రాయకపోయినా, మీ పాఠ్య పుస్తకాలు మీ మేధస్సుకు అవరోధం కాదన్నారు. ఒకే రకమైన పద్ధతిలో వెళ్లడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు.
పాఠ్య పుస్తకాలను ఓ ఆటవస్తువుగా మార్చుకోవాలన్నారు. ఆడుతుపాడుతూ చదువును నేర్చుకోవాలన్నారు. చాలా సరదాగా చదవడం నేర్చుకుంటే.. పాఠ్య పుస్తకం పెద్ద సవాల్ కాదన్నారు. పరీక్షల సమయంలో అతిగా ఆలోచించడం తగ్గించాలన్నారు. దాని కోసం ఆయన విద్యార్థులకు కొన్ని చిట్కాలు ఇచ్చారు. ధ్యానం ఎలా చేయాలన్న అంశాన్ని ఆయన విద్యార్థులకు నేర్పించారు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ఇటీవల బాక్సర్ మేరీకామ్, నటి దీపికా పదుకునే కూడా విద్యార్థులతో ముచ్చటించారు.
#WATCH | ‘Pariksha Pe Charcha’ | Spiritual leader and founder of the Isha Foundation, Sadhguru Jaggi Vasudev interacts with students.
While speaking with the students, Sadhguru Jaggi Vasudev says, “Your textbook is not a challenge for your intelligence, no matter who you are. No… pic.twitter.com/PLLJhxBzUB
— ANI (@ANI) February 15, 2025