Sadhguru : నేపాల్‌లో అకస్మిక వరదల కారణంగా పలువురు ఇషా ఫౌండేషన్ సభ్యులను కోల్పోయామని సద్దురు జగ్గీవాస్ దేవ్ (Sadhguru Jaggi Vasudev) తెలిపారు. ఈ ప్రకృతి విపత్తు కారణంగా తమ యాత్రా బృందంలో 80 మంది మరణించారని ఆయన వెల్లడించారు. బుధవారం నాటి భయానక దృశ్యాలను తలచుకున్న ఆధ్యాత్మిక గురువు కన్నీళ్లతో ఈ విషాద వార్తను పంచుకున్నారు.
టిబెట్-నేపాల్ సరిహద్దులో వరద బీభత్సానికి మృతుల సంఖ్య ఇంతకింతకూ పెరుగుతూపోతోంది. ఊహించిన ప్రకృతి ప్రకోపం తీవ్రస్థాయిలో ఆస్తి, ప్రాణనష్టానికి కారణమైంది. వరదల తీవ్రతకు తమ ఫౌండేషన్‌కు చెందిన 80 మంది మరణించారని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు.
⚠️ 80 Kailash pilgrims from the Isha Foundation reportedly missing 😢
A Kailash Mansarovar pilgrimage group from the Isha Foundation was caught in a devastating flash flood near Gyirong (Kerung), on the China–Nepal border, while returning from the pilgrimage.
The group was… https://t.co/VhP7W9n42c pic.twitter.com/OjeZRYVig1
— The Modern Himachal (@themodernhp) August 27, 2026
‘అకస్మిక వరదలు మిగిల్చిన విధ్వంసం తీవ్రతను చూడండి. ఎక్కడచూసినా భీతావహ దృశ్యాలే. ఈ విపత్తు భయానకమైనది. అసాధారణమైనది. కైలాష్ మానస్‌సరోవర్ యాత్ర నుంచి తిరిగి వస్తున్న మా బృందం వరదల్లో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో ఇషా సభ్యులైన 80 మందిని కోల్పోయాం.యాత్రకు వెళ్లిన బృందం నాయకుడు ఇషాంగ ప్రవీణ్ నుంచి నాకు ఉదయం 905 గంటలకు తాము ఇమ్మిగ్రేషన్ సెంటర్ చేరుకున్నట్టు సందేశం పంపాడు. ఆ తర్వాత.. 9 నిమిషాలకే వరద విళయం సృష్టించింది. వారం క్రితం నేను ఉన్న ఇమ్మిగ్రేషన్ సెంటర్.. ఇప్పుడు వరదల్లో కొట్టుకుపోయింది’ అని సద్గురు కన్నీటిపర్యంతమయ్యారు.
Spiritual leader Sadhguru Jaggi Vasudev became emotional while confirming that a group of 80 pilgrims returning from the Kailash-Manasarovar Yatra is missing following devastating flash floods near the Nepal-Tibet border.
He said roads and communication networks have been… pic.twitter.com/kLNQCQSmeO
— IndiaToday (@IndiaToday) August 27, 2026
వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్న గైరాంగ్కు వెళ్లేందుకు తనను అనుమతించాలని భారత, చైనా దౌత్య కార్యాలయాలను కోరారీ ఆధ్యాత్మిక గురువు. ఇషా సాక్రెడ్ వాక్స్ ఆధ్వర్యంలో బుధవారం కైలాష్ మానస్‌సరోవర్ యాత్ర నుంచి వస్తుండగా.. గల్లంతైన వారి లో భారతసంతతి అమెరికా దంపతులు దీపక్ ఆహుజా, మధు ఆహుజాలు కూడా ఉన్నారు.