ముంబై: ప్రఖ్యాత బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే(Asha Bhosle)కు ఇవాళ అంత్యక్రియలు నిర్వహించారు. అయితే లోవర్ పారెల్‌లోని కాసా గ్రాండెలో ఉన్న ఇంట్లో లెజెండరీ సింగర్ పార్దీవదేహానికి ప్రముఖులు నివాళి అర్పించారు. మేటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలీ .. సింగర్ ఆశాభోంస్లేకు నివాళి అర్పించారు. భోంస్లేకు నివాళి అర్పించే సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆ క్షణంలో దుఖ్కం ఆపుకోలేకపోయారు. అక్కడ ఉన్నవారితో మాట్లాడుతూనే సచిన్ కన్నీరు కార్చారు. కన్నీళ్లను తుడుచుకుంటూ సచిన్ కనిపించారు. గత నెలలోనే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు వివాహమైంది. ఆ పెళ్లికి ఆశా భోంస్లే హాజరయ్యారు.
VIDEO | Mumbai: Sachin Tendulkar gets emotional as he arrives to pay tribute to legendary singer Asha Bhosle at her residence in Grande, Lower Parel.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/lLA2qis5Nq
— Press Trust of India (@PTI_News) April 13, 2026
ప్రభుత్వ లాంఛనాలతో ఇవాళ సాయంత్రం శివాజీ పార్క్‌లో భోంస్లే అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఏకనాథ్ షిండే, సునేత్ర పవార్ ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు.