శబరిమల: కోట్లాది మంది భక్తులు పూజించే అయ్యప్ప కొలువైన శబరిమల దేవాలయంలో శనివారం మకరవిళక్కు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మకర జ్యోతి దర్శనం ఉత్సవాల్లో భాగంగా జనవరి 13, 14 తేదీల్లో ప్రసాద శుద్ధ క్రియ, బింబ శుద్ధ క్రియ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మకర జ్యోతి దర్శనం జనవరి 15 సాయంత్రం జరుగుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ తెలిపింది. అదే రోజున సన్నిధానంలో స్వామివారికి తిరువాభరణం, దీపారాధన ఉంటాయని తెలిపింది. జనవరి 20న పూజల అనంతరం దేవాలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపింది.