పాట్నా: బీహార్ ఉప ఎన్నికల్లో(Bihar Bypolls) .. ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరిగాయి. వాటిల్లో మూడింటిలో ఎన్డీఏ కూటమి లీడింగ్‌లో ఉన్నది. ఓ స్థానంలో బీఎస్పీ ఆధిక్యంలో కొనసాగుతోంది. తరారి, బెలాగంజ్, ఇమామ్‌గంజ్ స్థానాల్లో ఎన్డీఏ లీడింగ్‌లో ఉన్నది. రామ్‌ఘర్‌లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధిక్యంలో ఉన్నది.
ఈసీ వెబ్సైట్ ప్రకారం .. తరారిలో బీజేపీ అభ్యర్థి విశాల్ ప్రశాంత్ 2636 ఓట్ల ఆధఙక్యంలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థి రాజూ యాదవ్‌పై ఆయన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ఇమామ్‌గంజ్ నియోజకవర్గంలో హిందుస్తాన్ అవామ్ మోర్చా అభ్యర్థి దీపా కుమారి ఆధిక్యంలో ఉన్నారు. బెలాగంజ్ అసెంబ్లీ స్థానంలో జేడీయూ నేత మనోరమాదేవి లీడింగ్‌లో ఉన్నారు. రామ్‌ఘర్‌లో బీఎస్పీ నేత సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.