Mohan Bhagwat | రాంచీ, జూలై 18: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జార్ఖండ్‌లోని బిష్ణుపూర్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఆశకు అంతు లేదు. జనం సూపర్‌మ్యాన్ అవాలనుకుంటారు. కానీ అక్కడితో ఆగిపోరు. ఆ తర్వాత దేవత అవాలని, అనంతరం భగవంతుడిగా మారాలని కోరుకుంటారు.
అయితే భగవంతుడు.. తాను ‘విశ్వరూపుడిని’ అని అంటారు. విశ్వరూపం కన్నా పెద్దది ఇంకా ఏదైనా ఉందేమో ఎవరికీ తెలియదు. కార్యకర్తలు దీనిని అర్థం చేసుకోవాలి. ఎల్లవేళలా మరింత ఎక్కువగా శ్రమించాలి’ అన్నారు. అయితే, భాగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నది.