బెంగుళూరు: సుమారు 854 కోట్ల సైబర్ కుంభకోణాన్ని(cyber scam) బెంగుళూరు పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఈ కేసులో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆ సైబర్ గ్యాంగ్ వేలాది మంది బాధితుల్నిమోసం చేసింది. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ పేరుతో సైబర్ స్కామ్‌కు పాల్పడ్డారు. మొత్తం అమౌంట్లో సుమారు 5 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా బాధితుల్ని నిందితులు మోసం చేశారు. చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని బాధితుల్ని ఆ గ్యాంగ్ ఆశ్రయించేది. వెయ్యి నుంచి పది వేల వరకు జమ చేస్తే, ప్రతి రోజు ఆ అమౌంట్‌పై వెయ్యి నుంచి 5 వేల వరకు లాభం పొందవచ్చు అని ఆశ చూపారు. అయితే ఆ సైబర్ గ్యాంగ్ వలకు అనేక మంది చిక్కారు. వేల సంఖ్యలో జనం సుమారు లక్ష నుంచి పది లక్షల వరకు తమ డబ్బును ఇన్వెస్ట్ చేశారు.
బాధితులు ఇచ్చిన డబ్బును వేర్వేరు అకౌంట్ల ద్వారా ఆన్లైన్ పేమెంట్స్ చేశారు. అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియ ముగిసిన తర్వాత బాధితులు తమ అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోలేకపోయారు. వాళ్లకు రిఫండ్ రాలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. డబ్బును కలెక్ట్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని మనీల్యాండరింగ్‌కు చెందిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారని పోలీసులు ఆరోపించారు.
సుమారు 854 కోట్ల మొత్తాన్ని ఆన్లైన్ పేమెంట్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. బినాన్సి క్రిప్టో, పేమెంట్ గేట్‌వే, గేమింగ్ యాప్‌ల ద్వారా ఆ డబ్బును మళ్లించారు.