గాంధీనగర్: గుజరాత్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపి, మోసం చేసిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్ ఝలాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజే ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజే గ్రూప్ పేరుతో వేలాది మంది నుంచి రూ.6 వేల కోట్ల వరకు వసూలు చేసిన నిందితుడు నెల రోజుల నుంచి పరారీలో ఉండగా పక్కా సమాచారంతో సీఐడీ బృందాలు నిందితుడిని మెహ్సనా జిల్లా దావ్డాలోని ఫామ్‌హౌజ్‌లో పట్టుకున్నారు.
నిందితుడి నుంచి విలాసవంతమైన కార్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తున్నది. మరోవైపు భూపేంద్రసింగ్ స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది.