Bengaluru Ragpicker | చెత్త కుప్పలో రూ.25కోట్లు నకిలీవిగా తేల్చిన ఆర్బీఐ
Bengaluru Ragpicker | కర్ణాటక రాజధాని బెంగళూరులో చెత్తలో కట్టల కట్టల నోట్లు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ షేక్ (Salman Sheikh) అనే చెత్త ఏరుకునే వ్యక్తికి సుమారు రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికన్ డాలర్లు (US dollars) లభించాయి. అయితే, ఆ నోట్లు నకిలీవిగా తేలాయి.
Bengaluru Ragpicker | కర్ణాటక రాజధాని బెంగళూరులో చెత్తలో డాలర్ల నోట్ల కట్టలు దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ షేక్ (Salman Sheikh) అనే చెత్త ఏరుకునే వ్యక్తికి సుమారు రూ.25 కోట్ల విలువైన 23 కట్టల అమెరికన్ డాలర్లు (US dollars) లభించాయి. అయితే, ఆ నోట్లు నకిలీవిగా తేలాయి. ఈ విషయాన్ని పోలీసులు తాజాగా వెల్లడించారు.
నవంబర్ 1న బెంగళూరులోని హెబ్బల్‌లో సల్మాన్‌కు చెత్తకుప్పలో 23 అమెరికన్ డాలర్ల నోట్ల కట్టలు కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన సల్మాన్.. ఆ కట్టలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నవంబర్ 5వ తేదీన ఈ విషయాన్ని తన యజమాని బప్పకు చెప్పి నోట్ల కట్టలన్నింటినీ అతడికి ఇచ్చాడు. దీంతో అతను ఈ విషయాన్ని స్థానిక సామాజిక కార్యకర్తకు తెలియజేశాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను కలిసి జరిగిందంతా చెప్పారు. నోట్ల కట్టలను పరిశీలించిన కమిషనర్ ఆ మొత్తం విలువ రూ.25 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే, ఆ నోట్లకు ఏవో రసాయనాలు పూసి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన హెబ్బల్ పోలీసులు ఆ నోట్లు నిజమైన డాలర్లేనా..? లేక నకిలీవా..? అని తేల్చేందుకు వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు పంపారు. అయితే, ఆ నోట్లను ఆర్బీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించగా.. అవి నికిలీవని తేలింది. ఆ నోట్లు ప్రింట్ లేదా ఫొటోకాపీ తీసినవిగా గుర్తించినట్లు పోలీసులు (Printed Or Photocopied) వెల్లడించారు.
Also Read..
Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి
Fresh Snowfall | ఉత్తరాదిపై మంచు వర్షం.. వీడియోలు
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | హైదరాబాద్ టు ఢిల్లీ వయా గోవా.. 80వ సారి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ టూర్
దేవుడు దిగొచ్చినా నీళ్లు ఇవ్వలేం.. తాగునీళ్లు ఇస్తే గొప్ప.. సత్తుపల్లి సభలో మంత్రి తుమ్మల
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

