చండీగఢ్ : జైపూర్‌కి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా స్నేహితుడు ఇచ్చిన రూ.500 అప్పుతో లాటరీ టికెట్ కొని రూ.11 కోట్లు గెలుచుకున్నారు. ఆ డబ్బును తీసుకోవడానికి మంగళవారం అతడు చండీగఢ్ వచ్చారు.
ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ పంజాబ్ ప్రభుత్వపు దీపావళి బంపర్-2025 లాటరీ టికెట్‌ని తన స్నేహితుడి సాయంతో కొన్నానని చెప్పారు.