న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్ష మరో అగ్నిపథ్లా మారనున్నదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటికీ నియామకాలు పూర్తికాకపోవటమే వారి ఆందోళనకు కారణం. 2018 ఫిబ్రవరి 28న నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీ(ఎన్టీపీసీ)లో ఉద్యోగాలకు రైల్వే నియామక బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఓ నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించింది.
అదే ఏడాది, జూన్-జూలైలో సీబీటీ (స్టేజ్ 1) పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించినా, ఆ పరీక్ష 2021 జనవరిలో పూర్తయ్యింది. కానీ, లెవెల్ 5, 4, 3, 2 ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఈ పరీక్షను కూడా అగ్నిపథ్లా మార్చుతారా? అందుకే ఫలితాలను వెల్లడించటం లేదా? అని అభ్యర్థులు సోషల్ మీడియాలో రైల్వే బోర్డుకు #RRBNTPCRESULTS హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు.