లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది నవజాత శిశువులు మరణించారు. అయితే హాస్పిటల్ సందర్శన కోసం వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు వీఐపీ స్వాగతం (VIP Welcome) పలికారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో నవజాత శిశు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో చికిత్స పొందుతున్న 54 మంది శిశువుల్లో పది మంది మరణించారు.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో ఆ శిశువుల కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. అయితే ఆ ఆసుపత్రిని సందర్శించిన డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్‌కు అధికారులు వీఐపీ స్వాగతం పలికారు. హాస్పిటల్ ప్రాంగణంలోని రోడ్డు అంచుల్లో ముగ్గు చల్లారు. దీంతో యూపీలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ చర్య సిగ్గుచేటని విమర్శించింది.
మరోవైపు ఆరోగ్యశాఖ బాధ్యతలు నిర్వహించే డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ ఈ విమర్శలపై స్పందించారు. దీని పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీఐపీ స్వాగతాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి రోడ్డు వద్ద సున్నం వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
BJP सरकार की संवेदनहीनता देखिए।
एक ओर बच्चे जलकर मर गए, उनके परिवार रो रहे थे, बिलख रहे थे।
दूसरी तरफ, डिप्टी CM के स्वागत के लिए सड़क पर चूने का छिड़काव हो रहा था।
परिजनों का यहां तक कहना है कि पूरे कम्पाउंड में गंदगी फ़ैली हुई थी, जो डिप्टी CM के आने से पहले ही साफ की गई।… pic.twitter.com/M1sk8SAa0E
— Congress (@INCIndia) November 16, 2024