న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: హిందువులను గుర్తించి మరీ హతమార్చిన పహల్గాం ఉగ్ర దాడిపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్లో తాము బలహీనపడినట్లు ముస్లింలు భావిస్తున్నారని వాద్రా వ్యాఖ్యానించారు.
మన దేశంలో హిందువులకు, ముస్లింలకు మధ్య తీసుకువచ్చిన చీలికే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. కాగా, వాద్రా వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వీయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అల్లుడు సిగ్గులేకుండా ఉగ్ర చర్యను ఖండించకుండా సమర్థించడం దిగ్భ్రాంతికరమని ఆయన అన్నారు.