లక్నో: చేతికి తాడు కట్టిన నేరస్తుడు బైక్ నడిపాడు. (Rope Tied Criminal Rides Bike) ఆ తాడు పట్టుకున్న పోలీస్ హెల్మెట్ ధరించి వెనుక కూర్చొన్నాడు. ఒక వాహనదారుడు తీసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో ఈ సంఘటన జరిగింది. శీతాకాలంలో ఉదయం వేళ చలి నేపథ్యంలో బైక్ నడిపేందుకు నేరస్తుడ్ని ఒక పోలీస్ కానిస్టేబుల్ వినియోగించుకున్నాడు. అతడి చేతికి తాడు కట్టాడు. ఆ నేరస్తుడు బైక్ నడపగా హెల్మెట్ ధరించిన పోలీస్ కానిస్టేబుల్ తాడు పట్టుకుని వెనుక కూర్చొన్నాడు.
కాగా, కారులో ప్రయాణించిన ఒక వ్యక్తి దీనిని గమనించాడు. మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీస్ చర్యను కొందరు తప్పుపట్టగా మరికొందరు సమర్థించారు.
మరోవైపు ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆ పోలీస్‌ను మెయిన్‌పురిలోని భోంగావ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
#मैनपुरी: एक वायरल वीडियो में हथकड़ी लगे मुलजिम को सिपाही को बाइक पर बैठाकर पेशी के लिए ले जाते हुए देखा गया है। यह वीडियो थाना भौंगांव क्षेत्र का बताया जा रहा है, जिसमें मुलजिम खुद बाइक चला रहा है और पीछे सिपाही बैठा है। भौंगांव थाने का सिपाही वीडियो में दिख रहा है।… pic.twitter.com/XR7sHPuL6V
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) December 13, 2024