న్యూఢిల్లీ: దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్లు ఇవాళ రాహుల్ గాంధీ తెలిపారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ వార్షిక లీగల్ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ(Rohal Jaitley) ఖండించారు. రోహన్ తన ఆన్లైన్ అకౌంట్లో స్పందిస్తూ.. సాగు చట్టాలను 2020లో ప్రవేశపెట్టారని, కానీ రైతు ఉద్యమం వల్ల ఆ మూడు చట్టాలను రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
అయితే తన తండ్రి అరుణ్ జైట్లీ.. ఆ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందే మరణించినట్లు రోహన్ తెలిపారు. విపక్షాలను బెదిరించడం తన తండ్రి నైజం కాదు అని, ఆయన బహిరంగ చర్చలకు ఇష్టపడేవారన్నారు. తన తండ్రి 2019లో చనిపోయారని, కానీ సాగు చట్టాలను 2020లో ప్రవేశపెట్టారన్నారు.
దివంగత నేతల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని రాహుల్‌ను ఆయన కోరారు. మనోహర్ పారికర్ చివరి రోజులు గడుపుతున్న సమయంలో కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలే చేసినట్లు రోహన్ ఆరోపించారు.
Rahul Gandhi now claims my late father, Arun Jaitley, threatened him over the farm laws.
Let me remind him, my father passed away in 2019. The farm laws were introduced in 2020. More importantly, it was not in my father’s nature to threaten anyone over an opposing view. He was a…— Rohan Jaitley (@rohanjaitley) August 2, 2025