న్యూఢిల్లీ: రోబోలు అబద్ధాలు ఆడగలవట. మనల్ని మోసం కూడా చేయగలవట. మనిషి మనుగడకే సవాల్ విసురుతున్న తాజా అధ్యయన వివరాలను అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కృత్రిమ మేధస్సు మరింత వృద్ధి చెందుతున్న తరుణంలో రోబోలు మనిషిలా ప్రవర్తిస్తాయని తెలిపారు. ప్రస్తుతం చాట్‌బాట్స్ కొన్ని సందర్భాల్లో మనిషిని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఉదహరిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత కార్యకలాపాల నుంచి మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.