బీహార్లో దోపిడీ దొంగల ముఠా పట్టపగలు రెచ్చిపోయింది. ఆరా నగరంలోని తనిష్క్ నగల షోరూంలో చొరబడి రూ.25 కోట్ల విలువైన బంగారు నగల్ని, పెద్ద మొత్తంలో నగదును పట్టుకెళ్లిపోయారు. దుండగులు నగల షోరూం సిబ్బంది, కస్టమర్ల తలలపై తుపాకులతో గురిపెట్టి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు.
సోమవారం ఉదయం చోటుచేసుక్ను ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు విడుదలైంది. దొంగల ముఠా ఆరా నగర శివారులో తమకు ఎదురుపడగా.. ఎన్కౌంటర్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారని పోలీసులు చెప్పారు.