న్యూఢిల్లీ : ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణికుడి భద్రత కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది.
ఆకస్మికంగా బ్రేక్ వేసినప్పుడు చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధించడానికి, జారిపోయే, క్రాష్ అయ్యే ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ వ్యవస్థ దోహదపడుతుంది. అలాగే ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలో వాహన తయారీదారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సూచించిన స్పెసిఫికేషన్లకు అనుగుణంగా రెండు రక్షణ శిరస్ర్తాణాలను సరఫరా చేస్తారని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది.