Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని నాలుగు రాష్ట్రాల వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీరిలో 60 శాతం మంది 18-34 ఏళ్ల మధ్య వయస్కులేనని తెలిపారు. 2024 చివరి నాటికి ప్రమాదాలు, మరణాలు 50 శాతం తగ్గుతాయని తాను చెప్పానన్నారు. ప్రమాదాల సంఖ్య తగ్గింపు విషయాన్ని పక్కనపెడితే.. పెరిగిందన్న విషయం ఒప్పుకోవడంలో తనకు ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వం తరఫున ఎంత చేసినా ఇప్పటికీ చాలా మంది ప్రజలు చట్టానికి భయపడడం లేదన్నారు. అత్యధిక రోడ్డు ప్రమాదాలు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ముందున్నది. ఉత్తరప్రదేశ్‌లో 23,652, తమిళనాడులో 18,347, మహారాష్ట్రలో 15,366
, మధ్యప్రదేశ్‌లో 13,798 ప్రమాదాలు జరిగాయన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 1,457 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని.. ఆ తర్వాత బెంగళూరులో 915 మంది, జైపూర్‌లో 850 మృతి చెందారన్నారు. ప్రమాదాల్లో ఇంత మంది చనిపోతున్నాయని చట్టానికి ఎవరూ పడడం లేదంటూ ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. కొందరు హెల్మెట్ ధరించడం లేదని.. కొందరు ట్రాఫిక్‌లో సిగ్నల్స్‌ని ఉల్లంఘిస్తున్నారని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమసయంలో వివరించారు. భారతదేశంలో బస్సు బాడీలను తయారు చేయడంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. బస్సుల్లో కిటికీలకు దగ్గరలో సుత్తి ఉండాలని.. ప్రమాదం జరిగిన సమయంలో సులువుగా బయటపడవచ్చన్నారు. అంతర్జాతీయ సదస్సులకు హాజరయ్యేందుకు వెళ్లినప్పుడల్లా భారత్‌లో రోడ్డు భద్రతా వ్యవస్థ గురించి మాట్లాడేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని.. తలెత్తుకునే పరిస్థితి లేదని.. ముఖాన్ని దాచుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. కొద్దిరోజుల కిందట కుటుంబం సైతం ప్రమాదం బారినపడ్డామని.. దేవుడి దయతో బతికి బయటపడ్డామన్నారు.