Road accident : కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏడుగురు విద్యార్థులతో వెళ్తున్న ఇన్నోవా కారును ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు మొత్తం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ఏడుగురు దుర్మరణం పాలయ్యారు.
మృతుల్లో ఆరుగురు విద్యార్థులు, కారు డ్రైవర్ ఉన్నారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. గాయపడిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ పారిపోయాడు.
పోలీసుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.