హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రమాదాలు జరిగి భక్తులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా అలహాబాద్ జిల్లా మనుకాపురా ప్రాంతంలో మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై భక్తులతో నిండిన బొలెరో వాహనం ఓ బస్సును ఢీ కొనడంతో 10 మంది మృతి చెందగా, 19 మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తంచేశారు.
కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సెక్టార్ 18, 19ల మధ్య మంటలు చెలరేగాయి. అనేక టెంట్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.