Road accident : ఓ స్కార్పియో అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. స్కార్పియో డ్రైవర్ మితిమీరిన వేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలయ్యేందుకు కారణమైంది. ఆరు బైకులను ధ్వంసం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా క్షణాల్లో ఘోరం జరిగిపోయింది.
వివరాల్లోకి వెళ్తే.. నరసాపురంలో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఓ స్కార్పియో బైకును బలంగా ఢీకొట్టింది. అయినా వెంటనే బ్రేకులు వేయని స్కార్పియో డ్రైవర్ బైకును రోడ్డు కుడిపక్కకు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో బైకు మీద ఉన్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బైకు నడుపుతున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ఓ కుటుంబం ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.
స్కార్పియో బైకును ఢీకొట్టిన సమయంలో సరిగ్గా అదేచోట మరో కుటుంబం ఉంది. రోడ్డుపై ఓ వ్యక్తి బైకు పెట్టుకుని నిలబడగా.. ఓ మహిళ, ఓ బాలుడు రోడ్డు పక్కన దుకాణంలో ఏదో వస్తువు కొనుగోలు చేసి బైకు దగ్గరికి వచ్చారు. వాళ్లు బైకు ఎక్కుతుండగానే వారికి ఎదురుగా వస్తున్న మరో బైకును స్కార్పియో ఢీకొట్టి రోడ్డు కుడివైపుకు ఈడ్చుకొచ్చింది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైకులను కూడా స్కార్పియో ధ్వంసం చేసింది.
A speeding car created havoc, rams into people in #Narasapuram#CCTV footage of the horrific #RoadAccident :
Due to reckless driving, a #Speeding Scorpio car loses control and rams into people on its wrong side, killing one and another one injured seriously, 6 two-wheelers… pic.twitter.com/PaeVv8VQhS— Surya Reddy (@jsuryareddy) August 9, 2024