UP Polls | మోదీ బిజ్నోర్ ర్యాలీ రద్దు..కాషాయ పార్టీకి ఎదురుగాలి : ఆర్ఎల్డీ చీఫ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజ్నోర్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించాల్సిన ర్యాలీ రద్దు కావడం పట్ల రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌధరి స్పందించారు.
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజ్నోర్‌లో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించాల్సిన ర్యాలీ రద్దు కావడం పట్ల రాష్ట్రీయ లోక్‌దళ్ చీఫ్ జయంత్ చౌధరి స్పందించారు. యూపీలో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని ఎద్దేవా చేశారు. బిజ్నోర్‌లో ప్రధాని స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రసంగించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేసుకున్నారు. ఆపై ర్యాలీకి యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హాజరయ్యారు. ప్రతికూల వాతావరణంతో ప్రధాని హెలికాఫ్టర్ ల్యాండ్ కాలేకపోతోందని తాను కూడా సభా వేదికకు ఆలస్యంగా చేరుకున్నానని యోగి వివరణ ఇచ్చారు.
అయితే బిజ్నోర్‌లో వాతావరణ పరిస్ధితులు బాగానే ఉన్నాయని జయంత్ చౌధరి ట్వీట్ చేశారు. బిజ్నోర్‌లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడని..బీజేపీ పరిస్ధితే బాగా లేదని చురకలు వేశారు. బిజ్నోర్ ర్యాలీలో 1000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక వర్చువల్‌గా ప్రధాని మోదీ బిజ్నోర్, మొరదాబాద్, అమ్రోహ జిల్లాలకు చెందిన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 18 నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో మోదీ ముచ్చటించారు.
ఇక యూపీలో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా, దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటైన పోటీ ఇచ్చేందుకు మాయావతి సారధ్యంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది. యూపీలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

