Lalu Prasad Yadav : రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను పట్నాలోని ఇందిరాగాంధీ వైద్య విజ్ఞానసంస్థ (IGIMS) లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం శనివారం ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIIMS) కు తరలించనున్నారు. శుక్రవారం సాయంత్రం రక్తపోటు హెచ్చుతగ్గులకు గురికావడంతో ఆయనను పట్నాలోని ఇందిరా గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ (IGIMS) లో చేర్పించారు.
అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి అత్యవసర చికిత్స చేశారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం తదుపరి వైద్య పరీక్షల కోసం లాలూని ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకెళ్తామని ఆయన పెద్ద కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి తెలిపారు. కాగా, లాలూ చాలాకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 2022 డిసెంబర్లో సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.