H3N2 influenza | కాన్పూర్లో విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్.. ఆసుపత్రులకు క్యూ కడుతున్న రోగులు
H3N2 influenza | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Corona Virus) కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో హెచ్3ఎన్2 (H3N2) వైరస్ విజృంభిస్తుండటం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) లోని కాన్పూర్ (Kanpur)లో ఈ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.
H3N2 influenza | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (Corona Virus) కేసులు తగ్గుముఖం పడుతున్న ప్రస్తుత తరుణంలో హెచ్3ఎన్2 (H3N2) వైరస్ విజృంభిస్తుండటం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించిన విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇన్ఫ్లూయెంజా వైరస్ (Influenza virus) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది.
ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) లోని కాన్పూర్ (Kanpur)లో ఈ వైరస్ విజృంభిస్తోంది. అక్కడ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో అత్యవసర వార్డులు కిక్కిరిపోతున్నాయి. తాజాగా కాన్పూర్ (Kanpur) నగరంలోని హల్లెట్ ప్రభుత్వ ఆసుపత్రి ( Hallet Hospital) కి రోగులు క్యూ కట్టారు. జ్వరం, నిరంతరాయంగా దగ్గు, ముక్కు కారడం, శ్వాసకోశ వంటి సమస్యలతో ఒక్క రోజులోనే 200 మంది ఆసుపత్రికి వచ్చారు. వీరిలో 50 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతుండటంతో అక్కడి ఎమర్జెన్సీ వార్డులు కిక్కిరిసిపోవడంతో రోగులను ఇతర వార్డులకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితిపై ఆసుపత్రిలోని మెడిసిన్ డిపార్ట్మెంట్ ( Medicine Department) అధిపతి రిచా గిరి (Richa Giri) మాట్లాడుతూ ‘సాధారణంగా ఏటా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఇలాంటి కేసులు చూస్తుంటాం. కానీ, ఈ సారి పేషేంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వారిలో ఎక్కువ మందిలో జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలున్నాయి. గత 24 గంటల్లో కేవలం శ్వాసకోశ సమస్యలతోనే 24 మంది వైద్యశాలలో చేరారు. వారికి ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది వెంటిలేటర్లపై ఉన్నారు’ అని రిచా గిరి వెల్లడించారు.
Also Read..
Khushbu | ఆ విషయాన్ని చెప్పినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు : ఖుష్బూ
Russia – Ukraine War | యుద్ధం మిగిల్చిన విషాదం.. కనుమరుగైన మరింకా పట్టణం..!
Iran | బాలికలపై విషప్రయోగం.. విద్యార్థుల తల్లిదండ్రులు సహా పలువురి అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

