Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి పరాభవం.. ఈ కారణాలే కొంపముంచాయా..?
Mamata Banerjee : విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన. ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో తిరుగులేకుండా 15 ఏళ్లపాటు సాగిన మమతా బెనర్జీ పాలనకు తెరపడింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ఓటమి దిశగా సాగుతోంది. బీజేపీ అధికారం దక్కించుకునేందుకు సిద్ధంగా ఉంది. పూర్తి ఫలితాలు వెల్లడించడమే ఆలస్యం. అయితే, 15 ఏళ్లపాటు సాగిన మమతా బెనర్జీ పాలనను దెబ్బకొట్టి, పార్టీని ఓడించిన అంశాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన.
ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది. ఘటనలో బాధితురాలి తప్పే ఉందన్నట్లు ఆమె వ్యవహరించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంలో సరిగ్గా వ్యవహరించలేదు. దీంతో మహిళలు, యువత మమతపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో బాధితురాలి తల్లికి బీజేపీ అసెంబ్లీ సీటు ఇచ్చి మరీ పోటీ చేయించింది. ప్రస్తుతానికి ఆమె విజయం దిశగా సాగుతోంది. హత్యాచార ఘటనలో మృతురాలి తల్లి పోటీ చేయడంతో సానుభూతి వ్యక్తమై బీజేపీకి మద్దతు పెరిగింది. జన్ జీ, జన్ ఎక్స్ యువత ఎక్కువగా బీజేపీకి అండగా నిలిచారు. టీఎంసీ సాగించిన గూండాయిజం, కార్యకర్తల దాడులు వంటి వాటితో ప్రజలు విసిగిపోయారు.
మరోవైపు మమత సన్నిహితులపై జరిపిన దాడుల్లో భారీగా అక్రమ నగదు పట్టుబడింది. ఇది కూడా మమత ఇమేజ్ మసకబారడానికి కారణాలు. ఇక ఈ ఎన్నికల్లో టీఎంసీ అనుసరించిన వ్యూహం మరో తప్పిదంగా చెప్పుకోవచ్చు. బీజేపీని బయటి పార్టీగా టీఎంసీ చెప్పుకొచ్చింది. కానీ, బీజేపీ మాత్రం మమత ప్రభుత్వం అవినీతి, అక్రమాల గురించి ప్రస్తావించింది. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో టీఎంసీ విఫలమైందని ఆరోపించింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడంలోనూ టీఎంసీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఇక, ఇటీవల కేంద్రం నిర్వహించిన సర్ అంశంలో ఓట్ల తొలగింపు కూడా ఆ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Mamata Banerjee
- RG Kar
- TMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

