న్యూఢిల్లీ, మే 27: ప్రచురణకు సంబంధించిన కార్యకాలపాలు సాగిస్తూ విదేశీ విరాళాలను స్వీకరిస్తున్న ఎన్జీవోలు న్యూస్ లెటర్ని ్రప్రచురించడం సాధ్యపడదని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. వార్తా కథనాలను పంపిణీ చేయబోమని రిజిస్ట్రార్ ఆఫ్ ది న్యూస్పేపర్ ఫర్ ఇండియా నుంచి తప్పనిసరిగా సర్టిఫికెట్ తీసుకోవాలని కూడా ఎన్జీవోలను కేంద్రం ఆదేశించింది.
విదేశీ విరాళాల(నియంత్రణ) చట్టం(ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ కోరే ఎన్జీవోలు ఈ కొత్త నిబంధనకు కట్టుబడి ఉండాలని కేంద్రం తెలిపింది.