న్యూఢిల్లీ: చైనాలో రోజు రోజుకూ హెచ్9ఎన్2 కేసులు పెరుగుతున్నాయి. పిల్లల్లో నుమోనియా లక్షణాల తీవ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో చైనాలో కొంత ఆందోళన మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో భారతీయ డాక్టర్లు (Indian Doctors)వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ శుక్లా తెలిపారు. రోటీగానే చేసే స్వచ్ఛతను ఫాలో అవ్వాలన్నారు. ఎవరికైనా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకితే వాళ్లు తక్షణమే ఇతరులకు దూరంగా ఉండాలని సూచన చేశారు. వైరల్ కేసులు తొందరగా వ్యాపిస్తాయి కాబట్టి, వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలని డాక్టర్ శుక్లా తెలిపారు.
ఢిల్లీలో కాలుష్యం తీవ్రంగా ఉందని, వీలైతే ఎన్95, ఎన్99 మాస్క్‌లను వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు చేతుల్లో కడుక్కోవాలని, ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలని డాక్టర్ శుక్లా తెలిపారు. స్కూల్‌కు వెళ్లే పిల్లల విషయంలో శ్రద్ధగా ఉండాలన్నారు. దగ్గు, జలుబు, జ్వరంలాంటి లక్షణాలు కనిపిస్తే పిల్లల్ని స్కూళ్లకు పంపవద్దు అని సూచించారు. శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్న పిల్లల సంఖ్య చైనాలో పెరుగుతోందని శుక్లా తెలిపారు.
చైనాలో పరిస్థితి కొంత డిస్టర్బింగ్‌గా ఉందని, తమకు ఉన్న సమాచారం మేరకు రోజుకు 1200 మంది పిల్లలకు నుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కోవిడ్, కఠిన లాక్డౌన్ వల్ల సాధారణ ప్రజల్లో ఇమ్యూనిటీపై ప్రభావం చూపిందని, దాని వల్లే కేసులుఎక్కువగా కనిపిస్తున్నట్లు చెప్పారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్ శక్లా చెప్పారు.