న్యూఢిల్లీ: భారత రిపబ్లిక్ డే (Republic Day) వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర ఉత్సవాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ గణతంత్ర వేడుకలకు ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు తదితరులు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ ఉదయం జాతీయ వార్ మెమోరియల్‌ను సందర్శించడంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు.
కర్తవ్యపథ్‌కు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఆ తర్వాత జరిగిన పరేడ్, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. పరేడ్ ‘ఆవాహన్’తో మొదలైంది. ఆవాహన్లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన చేశారు.
#WATCH | President’s Bodyguard escort President Droupadi Murmu and French President Emmanuel Macron back to Rashtrapati Bhavan after the conclusion of #RepublicDay2024 parade. pic.twitter.com/8vOAGi92Ut
— ANI (@ANI) January 26, 2024