న్యూఢిల్లీ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ హైవేలు, ఎక్స్ ప్రెస్వేల వెంబడి వాహనాల రిపేర్, పంక్చర్ షాపులు ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ఏఐ దాని ఫీల్డ్ ఆఫీస్కు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ హైవేల వెంబడి ఇలాంటి షాపులు చాలా అవసరమని పేర్కొన్నది.
హైవేలపై ప్రయాణించేటప్పుడు వాహనాల్లో రిపేర్ సమస్యలు లేదా పంక్చర్ లాంటివి జరిగినప్పుడు ఈ షాపు లు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్పష్టం చేసింది. నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ప్రస్తుతం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో లీజు ప్రాతిపదికన హైవే సౌకర్యాల నెట్వర్క్ను డెవలప్ చేస్తున్నది.