PM Modi | న్యూఢిల్లీ, జూలై 25: ప్రధాని మోదీ పిరికివాడని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ విమర్శించారు. ఓ వార్త సంస్థతో ఆయన మాట్లాడుతూ ‘మణిపూర్ తగలబడిపోతున్నది. దేశ ప్రధాని హోదాలో ఉన్న మోదీ పార్లమెంట్‌కు జవాబుదారీగా ఉండాలి. కానీ మణిపూర్ మాట వింటేనే ఆయన భయపడుతున్నట్టు కనిపిస్తున్నది. మణిపూర్‌పై పార్లమెంట్లో మాట్లాడటానికి ఆయన జంకుతున్నారు. మోదీ పిరికివాడు’ అని అన్నారు. ప్రస్తుతం మణిపూర్ పరిస్థితిని చూస్తుంటే గుజరాత్ అల్లర్లు గుర్తుకొస్తున్నాయని గుహ పేర్కొ న్నారు. హింసాత్మక పరిస్థితి తలెత్తడానికి కేంద్ర, రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలే కారణమని విమర్శించారు.