న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో భాగంగా రెమ్డెసివిర్ యాంటీవైరల్ మందును మధ్యస్థ లేదా తీవ్రమైన లక్షణాలు ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే లక్షణాలు బయటపడిన 10 రోజుల్లో మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు లేనివారికి మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నది. ఆక్సిజన్ సపోర్టు అవసరం లేని వారికి, ఇంటి నుంచే చికిత్స తీసుకునేవారికి సిఫారసు చేయొద్దన్నది. తీవ్రత ఎక్కువ ఉన్న వారికి టొసిలిజుమాబ్ ఇవ్వాలని, అది కూడా 24-48 గంటల్లోపే ఇవ్వాలని తెలిపింది.