న్యూఢిల్లీ : అరుణాచల్‌ప్రదేశ్ సీఎం, బీజేపీ నేత పెమా ఖండూకు, ఆయన బంధువులకు మంజూరైన ప్రభుత్వ కాంట్రాక్టులపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తవంగ్ జిల్లాలో 31 ప్రభుత్వ కాంట్రాక్టులను వారికి అప్పగించడం యాదృచ్ఛికమా? అంటూ ప్రశ్నించింది.
ప్రజా పనుల కోసం నిర్వహించిన టెండర్ల మధ్య వ్యత్యాసం అత్యంత సూక్ష్మంగా ఉందని, టెండరుదారులు కుమ్మక్కు అయ్యే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఇతర జిల్లాల్లోనూ 2015 నుంచి 2025 వరకు కేటాయించిన ఇటువంటి అన్ని టెండర్ల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.